Thriller OTT: ఓటీటీకి వచ్చిన తెలుగు లేటెస్ట్ సైబర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Thriller OTT: ఓటీటీకి వచ్చిన తెలుగు లేటెస్ట్ సైబర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky). మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. యాక్షన్‍ థ్రిల్లర్ ఎంటర్‌టైనింగ్‍గా నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

మెకానిక్ రాఖీ ఓటీటీ::

మెకానిక్ రాఖీ మూవీ ఇవాళ (డిసెంబర్ 13) అర్దరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయట. దాదాపు రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. 

Also Read :  జీరో హేటర్స్ హీరో.. ఆ పుస్తకాలు చదివాకా జీవితం మారిపోయింది

ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, ఆన్లైన్ సైబర్ మోసాల బ్యాక్ డ్రాప్లో కథను ఎంచుకున్న దర్శకుడు సెకండాఫ్లో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే, ఇది చాలామంది ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ క్రైమ్ సమస్యతో వచ్చింది. కనుక ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం కథలో ఉంది. అయితే ఈ కథను సీరియస్ మోడ్ లోనో లేదా థ్రిల్లర్ గానో కాకుండా కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కించాడు. అదొక్కటే ఫస్టాఫ్కి మైనస్గా మారింది.

కథేంటంటే::

మలక్ పేటలో గ్యారేజ్ నడుపుతున్న నగుమోము రామకృష్ణ (నరేష్) కొడుకు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్). బీటెక్ డ్రాప్ అవుట్ అయిన రాకీ.. తండ్రితో కలిసి గ్యారేజ్, డ్రైవింగ్ స్కూల్ పనులు చూస్తుంటాడు. అయితే రంకి రెడ్డి (సునీల్) గ్యారేజ్ స్థలంపై కన్నేయడంతో రాకీ లైఫ్ లో సమస్యలు మొదలవుతాయి. అదే సమయంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయ (శ్రద్ధ శ్రీనాథ్) ఆ సమస్యల నుండి అతన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది. కానీ కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అసలు మాయ ఎవరు..? అతనికి ఎందుకు హెల్ప్ చేసింది..? ఆ సమస్యల నుండి రాకీ ఎలా బయటపడ్డాడు? అతని జీవితంలో ప్రియా ( మీనాక్షి చౌదరి)కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • Beta
Beta feature