Mechanic Rocky: విశ్వక్‌సేన్‌ మెకానిక్ రాకీ ట్రైలర్ టైమ్ ఆగయా.. రిలీజ్ ఎప్పుడంటే?

Mechanic Rocky: విశ్వక్‌సేన్‌ మెకానిక్ రాకీ ట్రైలర్ టైమ్ ఆగయా.. రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’.  మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్.  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌‌‌‌‌‌‌‌కి మంచి రెస్పాన్స్ రాగా,  తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 20న ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీరాములు థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్వక్, మీనాక్షి, శ్రద్ధా లుక్స్ ఆకట్టుకున్నాయి. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ  చిత్రం తెరకెక్కుతోంది. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం 
అందిస్తున్నాడు.