Vishwak sen: నన్ను ఎంత కిందకి లాగితే అంత పైకి లేస్తా.. విశ్వక్ సేన్ నోట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen), చాందినీ చౌదరి(Chandini Chaudary) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత(Vidyadhar Kagitha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సరికొత్త కథా, కథనాలతో విజువల్ వండర్ గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది గామి. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. నిజానికి గామి సినిమాకు మొదటి షో నుండి కాస్త నెగిటీవ్ టాక్ వచ్చింది. కొంతమంది కావాలని ఈ సినిమాకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చారు. అంతేకాదు బుక్ మై షో లో కూడా నెగిటివ్ రేటింగ్స్ వేయిస్తున్నారని అధికారికంగా తెలిపారు గామి మేకర్స్. తాజాగా ఈ నెగెటివ్ రేటింగ్స్ పై స్పందించాడు హీరో విశ్వక్ సేన్. దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో ఓ నోట్ రాసుకొచ్చాడు.. ప్రియమైన ప్రేక్షకులు, సినీ ఔత్సాహికులకు.. గామి భారీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇక గాని సినిమా రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా ప్రతిష్టపై నిరంతర దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. కొంతమంది  కావాలనే 10కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు. అలా రకరకాల యాప్స్ నుండి ఫేక్ రేటింగ్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల 9 ఉన్న గామి మూవీ రేటింగ్ 1కి పడిపోయింది. మీరు నన్ను ఎన్నిసార్లు కిందకు లాగాలని చూసినా.. నేను అంత పైకి లేస్తూనే ఉంటా. వీటి వెనుక ఉన్న వ్యక్తుల గురించి నాకు తెలియదు. కానీ, ఒక మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నాము.. భం భోలే నాధ్ .. జైహింద్.. అంటూ రాసుకొచ్చాడు విశ్వక్. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.