విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ సాగే పాటను గురువారం లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లోనే యాక్షన్ టచ్ తో ఉన్న కామెడీ సినిమా ఇది. ఇలాంటి కథతో సినిమా చేయాలని, లైలా లాంటి పాత్ర పోషించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.ఈ అవకాశం ఇచ్చిన సాహు అన్నకు థ్యాంక్స్.
లైలా పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేది. ఈ న్యూ ఏజ్ సినిమాను ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసిన క్లీన్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 1న ‘ఓహో రత్తమ్మ’ అనే రాయలసీమ మాస్ సాంగ్ విడుదల చేయనున్నాం’ అని చెప్పాడు.
దర్శకుడు మాట్లాడుతూ ‘లేడీ గెటప్‌తో ఇలాంటి చిత్రం చేయడమంటే సినిమా అంటే ఎంతో పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి ఉన్న విశ్వక్ నాకు దొరికారు. టీమ్ అందరి టెక్నికల్ బ్రిలియన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది’ అన్నాడు. ‘ధమ్కి’ చిత్రంలోని ‘ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా’ లాంటి హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ వచ్చిన పాట తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ కి ఈ పాట రాయడం సంతోషంగా ఉంది’ అని లిరిక్ రైటర్ పూర్ణాచారి అన్నాడు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘హీరోది లేడీ గెటప్ కనుక ఈ సినిమా చేయగలుగుతామా లేదా అనుకునే టైమ్‌లో విశ్వక్ ఓకే చెప్పాడు. ఇది తన కెరీర్‌లో మంచి క్యారెక్టర్‌గా నిలిచిపోతుంది’ అన్నారు.