Laila Bookings: లైలా మూవీ పెద్దలకు మాత్రమే (A సర్టిఫికెట్) : టికెట్లు చూసి బుక్ చేసుకోండి ఫ్యామిలీస్

Laila Bookings: లైలా మూవీ పెద్దలకు మాత్రమే (A సర్టిఫికెట్) : టికెట్లు చూసి బుక్ చేసుకోండి ఫ్యామిలీస్

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా  రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. వాలంటైన్స్ డే సందర్భంగా (ఫిబ్రవరి 14న) సినిమా రిలీజ్ కానుంది.

లేటెస్ట్గా (ఫిబ్రవరి 12న) లైలా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సందర్భంగా మేకర్స్ Xలో అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. "సరదా రైడ్ కోసం మా లైలాతో.. థియేటర్లలో మీ వాలెంటైన్ జరుపుకోండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

'A' సర్టిఫికేట్:

విశ్వక్ సేన్ లైలా మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. సినీ అభిమానులు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. లైలా మూవీకి A.. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఓన్లీ A సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వటంతో.. లైలా మూవీ పెద్దలకు మాత్రమే. పిల్లలకు ఎంట్రీ లేదు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు లైలా మూవీ ధియేటర్లలోకి ఎంట్రీ లేదు.

గతంలో యానిమల్, సలార్ మూవీ విషయంలో జరిగిన గొడవలు, గందరగోళాలతో.. అన్ని సినిమా ధియేటర్లలో కఠినమైన నిబంధనలు అమలు అవుతున్నాయి. 18 సంవత్సరాల వయస్సు పిల్లలకు A సర్టిఫికెట్ ఉన్న సినిమా ధియేటర్లలోకి ఎంట్రీని నిషేధించారు.

ఇప్పుడు లైలా మూవీ కూడా A సర్టిఫికెట్ మూవీ కావటంతో.. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఫ్యామిలీస్. మీ పిల్లలను తీసుకెళ్లొద్దు. ఎవరు పట్టించుకుంటారే.. ఎవరు చూశారులే అనే ధీమాతో టికెట్లు బుక్ చేసుకుని.. తీరా ధియేటర్ల దగ్గరకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడొద్దు.

మీ పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటితేనే.. లైలా మూవీ టికెట్లు బుక్ చేసుకోండి. పిల్లల వయస్సుకు సంబంధించి ఆధార్ కార్డు లాంటి వయస్సు దృవీకరణ కార్డును కూడా ముందు జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి.

Also Read :- నాని, శ్రీకాంత్ ప్యారడైజ్ గ్లింప్స్‌‌‌‌ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ మూవీలో అబ్బాయిగా, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నాడు విశ్వక్. వాలెంటైన్స్ డే రోజున ఈ సినిమా విడుదల కానుండటంతో యూత్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

లైలా నిడివి:

లైలా మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చింది. 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు) రన్‍టైమ్‍తో వస్తోంది. సాధారణం కంటే కాస్త తక్కువ నిడివితోనే రానుంది. సినిమా రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో ఈ క్రిస్పీ రన్‍టైమ్ సరిగ్గా సూటయ్యేలా కనిపిస్తోంది.