Vishwaksen: విశ్వక్ మేకప్ మేజిక్.. కెరీర్లో మొదటిసారి లేడీ రోల్.. ఆసక్తిగా లైలా టీజర్

హీరో విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకుడు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సోనూ మోడల్, లైలా అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్​లో కనిపించాడు.

సోనూ మోడల్‌కు ఓల్డ్‌ సిటీలో ఓ బ్యూటీ పార్లర్‌‌ ఉంటుంది. తన మేకప్ మేజిక్‌ వల్ల ఆ ఏరియా ఆడవాళ్లంతా అతని పార్లర్‌‌కు క్యూ కడతారు. లేడీస్‌లో అతని ఫాలోయింగ్ నచ్చని లోకల్ రౌడీలు సోనూని చంపేయాలి అనుకుంటారు. వాళ్లను ఎదుర్కొనే క్రమంలో.. ఒక్కొక్కళ్లకూ చీరలు కట్టి పంపిస్తానని పంచ్ డైలాగ్‌లు చెప్పిన సోను.. సీన్ కట్ చేస్తే శారీ కట్టుకుని లైలాలా మారిపోతాడు.

Also Read :- కెరీర్‌‌ బెస్ట్ హ్యాపీయస్ట్ మూమెంట్

అతను లైలాగా ఎందుకు మారాడు అనే క్యూరియాసిటీతో టీజర్ ముగించారు.  రెండు పాత్రల్లోనూ ఎనర్జిటిక్‌గా కనిపించాడు విశ్వక్.  ఆకాంక్ష శర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.  లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.  ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.