మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: దసరా కానుకగా విశ్వంభర టీజర్...

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: దసరా కానుకగా విశ్వంభర టీజర్...

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగులో విశ్వంభర అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి బింబిసార సినిమా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత వంశీ కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.  విశ్వంభర చిత్రంలో త్రిష, కునాల్ కపూర్, మీనాక్షీ చౌదరి, ఆషికా రంగనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 

ఇక ప్రముఖ  సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేగాకుండా ఈ చిత్ర టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇటీవలే  విశ్వంభర చిత్ర యూనిట్ మెగా అభిమనులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా  విశ్వంభర చిత్ర టీజర్ ని దసరా పండుగ సందర్భంగా ఉదయం 10:49 గంటలకి విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే  వశిష్ట బింబిసార చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. దీంతో మంచి స్క్రిప్ట్ తో మెగాస్టార్ ని మెప్పించాడు.

ఈ విషయం ఇలా ఉండగా విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ ని చేంజ్ చేసుకుని సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.