దసరా కానుకగా విశ్వంభర టీజర్..

దసరా కానుకగా విశ్వంభర టీజర్..

చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. దసరా కానుకగా  శనివారం ఉదయం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ  సందర్భంగా రిలీజ్ చేసిన చిరంజీవి పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.