హైదరాబాద్ సిటీ, వెలుగు: నాంపల్లిలోని ఆలియా మోడల్స్కూల్ హెడ్మాస్టర్గా పనిచేస్తున్న విశ్వనాథం గుప్తా స్కూల్ హెడ్ మాస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. 33 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి, జిల్లాకో స్కూల్హెడ్ మాస్టర్ చొప్పున హైబిజ్టీవీ ఎక్సలెన్స్అవార్డులను ప్రదానం చేసింది. హైదరాబాద్జిల్లా నుంచి విశ్వనాథం గుప్తాను స్కూల్ ఎడ్యుకేషన్డైరెక్టర్ నరసింహారెడ్డి ఎంపిక చేశారు.
అవార్డుల ప్రదానం కార్యక్రమం మంగళవారం హైటెక్ సీటీ నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. విశ్వనాథం గుప్తా పాల్గొని అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తనకు ఒక బూస్టింగ్ లాంటిదని, రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం స్కూల్ హెడ్మాస్టర్, డిప్యూటీ ఐఓఎస్ ఉన్న విశ్వనాథం గుప్తా 2017లోనూ బెస్ట్ హెడ్మాస్టర్ అవార్డు పొందారు.