
వెలుగు, నెట్వర్క్ : సిటీలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ కు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందిరా పార్క్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, భక్షాలను పంచిపెట్టారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు శోభన్ రెడ్డి హాజరయ్యారు.
మాదాపూర్ శిల్పారామంలో ఓయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య కమలాకర శర్మ పంచాంగ పఠనం చేశారు. అనంతరం అపర్ణ ధూళిపాళ్ల శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. సూరారం లక్ష్మీనగర్‌లోని శివాలయంలో, కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు.