
- ధనిష్ఠ 3, 4 పాదములు; శతభిషం 1, 2, 3, 4 పాదములు; పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా
- ఆదాయం : 8
- రాజపూజ్యం : 7
- వ్యయం : 14
- అవమానం : 5
గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు లోహమూర్తిగాను, తదుపరి 18.10.2025 వరకు తామ్రమూర్తిగాను తదుపరి 5.12.2025 వరకు లోహమూర్తిగా సంచారము.
శని: ఉగాది నుండి ఉగాది వరకు జన్మమందు రజితమూర్తిగా సంచారము.
రాహుకేతువులు: 18.05.2025 వరకు లోహమూర్తిగా తదుపరి రాహువు జన్మమందు కేతువు సప్తములో లోహమూర్తులుగా సంచారము.
ఈ రాశి స్త్రీ పురుషులకు ఎత్తుపల్లములుగా ఉంటుంది. రైతు సోదరులకు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగులకు ప్రయాణములలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదాయమునకు మించిన ఖర్చులు. లాయర్లు, డాక్టర్లు కొంత వెసులుబాటు ఉంటుంది. కాంట్రాక్టర్లకు టెండర్లు చాలా జాగ్రత్తగా వేయండి. రాజకీయ నాయకులు తొందరపడి ఏవిధమైన హామీలు ఇవ్వరాదు. కొన్ని విధములుగా ప్రజలలో సంపద తగ్గుతుంది. వెండి, బంగార వ్యాపారులకు అనుకూలం. సిమెంట్ఐరన్ టింబర్ వారికి కొంత మెరుగు. ఫ్యాన్సీ కిరాణ, వస్త్ర వ్యాపారులకు సామాన్యం.
ఫార్మా, మెడికల్ కెమికల్ రంగులు రసాయనములు వారికి అనుకూలం. బల్స్ డ్రగ్స్ బల్క్ ఫ్యాక్టరీలకు ఆదాయ వనరులు బాగుంటాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సామాన్యంగా ఉండగలవు. పాడి పరిశ్రమ పశువులు, మత్స్య పరిశ్రమ ఫౌల్ట్రీ పరిశ్రమ సామాన్య లాభం. చిట్స్ షేర్స్, చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు వ్యాపారములలో కొన్ని విధములుగా ఒడిదుడుకులు ఉండగలవు. మార్కెట్ డబ్బు స్టక్ అవుతుంది. కొన్ని స్థిరాస్తులు ఖరీదు చేయగలరు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొన్న వారికి ఏ విధమైన సమస్యలు లేవు.
అంత భయపడనవసరం లేదు. ఉండదు. నూతన ప్రయోగములు మార్పులు చేర్పులతో నూతన ఒరవడిని ఏర్పాటు చేయగలరు. ఎప్పుడు ఏదో ఒక మార్పు చేయుచు డెవలప్మెంట్ లో ఉంటారు. విద్యార్థులకు అధికమార్కులు శ్రద్ధ ఉన్నవారికి నిర్లక్ష్యముగా ఉన్నవారికి పాస్‌మార్కులు. చేతివృత్తులవారికి సామాన్యం. సినిమా రంగంలో జనాకర్షణ కలిగిన వారికి మాత్రమే క్రేజ్ ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు సామాన్యం. పబ్లిక్‌లో ఇమేజ్ కావాలి దేనికైనా వారితోనే స్టార్. ఈ సంవత్సరం సమ్మెలు చేయుటకు అవకాశములు ఉన్నవి.
వర్కర్స్ దొరకరు తక్కువ జీతములుకు పనిచేయరు. కంప్యూటర్ రంగంలో చాలా మందికి మనస్తాపం కలుగుతుంది. ప్రతిభ ఉన్నవారు దూసుకొనిపోగలరు. ధనిష్ట నక్షత్రం వారు పగడం ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు శతభిష నక్షత్రం వారు గోమేధికం ధరించండి. దుర్గాదేవికి పూజలు అష్టోత్తర శతనామాలు శ్రీచక్రమునకు కుంకుమ పూజలు చేయండి. పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించండి. శ్రీ సాయినాథునికి శనగలు గుగ్గిళ్ల ప్రసాదములు దక్షిణామూర్తికి పూజలు చేయండి. గురుబలం కలిగి సంతృప్తికరంగా ఉండగలరు.
చాలా తక్కువగా మాట్లాడగలరు. తల్లితండ్రి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనిగలరు. నవగ్రహ పూజలు శనికి తైలాభిషేకము ప్రదక్షిణలు దానాలు ఇవ్వండి. మీరు చాలా సందర్భంలలో నమ్మకం అనేది నష్టంతో కూడుకొన ఉన్నది. నమ్మకానికి భరోసాకి తావులేదు. ధ్యానం యోగ వలన ఏకాగ్రత కుదురును. ప్రతి విషయంలో పట్టుదల కలిగి నడుచుకొనవలెను. ఎవరిని నమ్మిన మోసపోగలరు. మీరు విశ్వాసముంతో వ్యాపార వ్యవహారములందు శ్రద్ధ తీసుకొనగలరు. అదృష్టసంఖ్యం 8.