నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఢిల్లీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిషన్ఆఫీసర్లు ప్రమోద్ కుమార్‌శర్మ, రితేశ్సింగ్జిల్లా కేంద్రానికి వచ్చారు. నగరంలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను విజిట్ చేశారు. రెండో విడతలో జరుగుతున్న ఓటరు లిస్టు సవరణను పరిశీలించారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పు, చేర్పుల లిస్టును పరిశీలించి ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్ ఢిల్లీ అధికారుల వెంట ఉన్నారు.