సాగర సందడి

  నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్​ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్​ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. ఈక్రమంలో సోమవారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనాలు ​సాగర్​అందాలను తిలకిస్తూ, ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.