అనంతగిరిలో పర్యాటకుల సందడి

అనంతగిరిలో పర్యాటకుల సందడి

నంది ఘాట్​ వద్ద సెల్ఫీల జోరు..

లోయల్లో పర్యాటకుల కేరింతలు

వికారాబాద్, వెలుగు:  అనంతగిరిలోని ఆదివారం పర్యాటకులు, భక్తులు సందడి చేశారు. అనంతపద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అనంతగిరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయంలోని ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత నంది ఘాట్​ వద్ద పర్యాటకులు, భక్తులు సెల్పీలు దిగారు. లోయల్లో కేరింతలు కొడుతూ అనంత అందాలను వీక్షించి సంతోషంగా గడిపారు. అక్కడి నుంచి కోట్​పల్లి ప్రాజెక్టు వెళ్లి బోటింగ్​చేశారు.