బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి నుమాయిష్‌కు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఇప్పటివరకు దాదాపు15 లక్షలకు పైగా జనం సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. మరో 15 రోజులు మాత్రమే నుమాయిష్ ఉండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
.