హైదరాబాద్: శుక్రవారం ఉదయం (అక్టోబర్ 25, 2024) ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా ఎయిర్లైన్స్ విమానం జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ డైవర్ట్ చేసినట్లు తెలిసింది. Flight UK-829 విమానం ఉదయం 8.30 సమయంలో జైపూర్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయినట్లు విస్తారా ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించింది. హైదరాబాద్ కు ఉదయం 11.30 గంటలకు ఈ విమానం చేరుకుంటుందని ట్వీట్లో విస్తారా తెలిపింది. సదరు ప్రయాణికుడిని జైపూర్లో ఎయిర్ పోర్ట్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
#DiversionUpdate: Flight UK829 from Delhi to Hyderabad (DEL-HYD) has been diverted to Jaipur (JAI) and is expected to arrive in Jaipur at 0830 hrs. Please stay tuned for further updates.
— Vistara (@airvistara) October 25, 2024
ఇదిలా ఉండగా.. ఇండియన్ ఎయిర్లైన్స్ పరిధిలో నడుస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్లైన్స్కు బాంబు బెదిరింపు కాల్స్ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. గురువారం ఒక్కరోజే (అక్టోబర్ 24, 2024) 95 విమానాలకు భారత్లో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది.
Also Read:-తిరుపతిలోని హోటల్స్ కు బాంబు బెదిరింపులు
ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, అలియన్స్ ఎయిర్, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానాలకు తాజాగా బాంబు బెదిరింపులొచ్చాయ్. ఆకాశా ఎయిర్ లైన్స్కు చెందిన25 విమానాలకు, ఎయిర్ ఇండియాకు చెందిన 20 విమానాలకు, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, అలియన్స్ ఎయిర్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గడచిన 10 రోజుల్లో భారత్లో 250 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. వీటిల్లో 170 విమానాలకు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే బెదిరింపులు వచ్చినట్లు ప్రభుత్వం తేల్చింది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులు వ్యవహారానికి సంబంధించి 8 కేసులు నమోదు చేశారు.