నవంబర్ 12 నుంచి విస్తారా సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌

నవంబర్ 12 నుంచి విస్తారా సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం చివరి దశకు చేరింది. విస్తారా   విమాన సర్వీస్‌‌‌‌లు త్వరలో మూతపడనున్నాయి. చివరి విమాన సర్వీస్‌‌‌‌ నవంబర్‌‌‌‌‌‌‌‌ 11 న ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా బ్రాండ్‌‌‌‌తో సర్వీస్‌‌‌‌లు కొనసాగుతాయి.  ‘సెప్టెంబర్ 3 తర్వాత నుంచి కస్టమర్లు  నవంబర్ 12 న లేదా ఆ తర్వాత   విస్తారాలో ట్రావెల్ చేయడానికి వీలుండదు’ అని ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ప్రకటించింది.   విస్తారా విమానాలను ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా  ఆపరేట్  చేస్తుందని, బుకింగ్స్ రూట్ కూడా ఎయిర్ ఇండియా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌కు షిఫ్ట్ అవుతుందని తెలిపింది.

ఈ ఏడాది నవంబర్ 11 వరకు జరిగే విమాన సర్వీస్‌‌‌‌ల కోసం మాత్రం బుకింగ్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఉంటాయని విస్తారా ప్రకటించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా, విస్తారా విలీన సంస్థలో సింగపూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ 276 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి  తాజాగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విలీనం వలన కస్టమర్లకు మరిన్ని సర్వీస్‌‌‌‌లు అందుబాటులో ఉంటాయని విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కన్నన్‌‌‌‌ అన్నారు. త్వరలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియాగా కస్టమర్లను ఆహ్వానిస్తామన్నారు. విలీన ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు  క్లబ్‌‌‌‌ విస్తారా కొనసాగుతుందని,  ఆ తర్వాత ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్లైయింగ్ రిటర్న్స్ ప్రోగ్రామ్‌‌‌‌లో కలుస్తుందని చెప్పారు.   ఎయిర్ ఇండియా– విస్తారా విలీన సంస్థలో సింగపూర్‌‌‌‌‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌కు 25.01 శాతం ఉంటుంది.