Vistara Airlines విస్తారా ఎయిర్ లైన్స్ చివరి ఫ్లైట్..భావోద్వేగంతో ప్రయాణికుల వీడ్కోలు

Vistara Airlines  విస్తారా ఎయిర్ లైన్స్ చివరి ఫ్లైట్..భావోద్వేగంతో ప్రయాణికుల వీడ్కోలు

టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్ లైన్స్.. టాటా గ్రూప యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ( నవంబర్ 11) న తన చివరి ఫ్లైట్ కు సోషల్ మీడియా వేదిక ఘనతం వీడ్కోలు పలికారు ప్యాసింజర్లు. భారత దేశానికి అత్యంత ఇష్టమైన క్యారియర్లలో ఒకటైన విస్తారాకు కృతజ్ణతలు తెలిపారు. 

చాలామంది ప్రయాణికులు విస్తారాతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా పంచుకున్నారు. ప్రపంచ స్థాయి సేవలందించే అగ్రశ్రేణి విమాన యాన సంస్థగా అభివర్ణించారు. 

ALSO READ | గుజరాత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో పేలుడు..

విస్తారా అందించిన లగ్జరీ, సౌకర్యాన్ని హైలైట్ చేస్తూ.. వారి ప్రయాణ అనుభవాలలో మర్చిపోలేని విషయాలను గుర్తు చేస్తూ.. వారి చివరి ఫ్లైట్ ఫొటోలు , జ్ణాపకాలు షేర్ చేశారు. విస్తారా గొప్ప విమానయాన సంస్థ.. ఒక బ్రాండ్ ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది. విస్తారా సేవలు ముగియడం చాలా బాధాకరం అని ఓ నెటిజన్ రాశారు.  

4.5 మిలియన్లకు పైగా విస్తారా లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులు ఎయిర్ ఇండిలో ఫ్లైయర్ ప్రోగ్రామ్ లో చేరనున్నారు.  విస్తారా విలీనంతో 90 కి పైగా దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాలకు యాక్సెస్ తో పాటు కోడ్ షేర్, ఇంటర్ లైన్ పార్టినర్ షిప్ తో దాదాపు 800 ప్రాంతాలకు ఎయిర్ ఇండియా కనెక్టివిటీ పెరుగుతుంది.