
రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.ఇద్దరు నిందితులు శంషాబాద్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఈ సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆగస్టు 10 వ తేది( గురువారం) అర్థరాత్రి 11 గంటలకు కిషన్ గుడా దగ్గర శ్రీనివాస ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని మహిళను హత్య చేసి పెట్రోలో పోసి నిప్పంటించారు.
మృతదేహాం గుర్తు పట్టని విధంగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, సీఐ శ్రీనివాస్, డీఐ రాజు యాదవ్ కేసు నమోదు చేశారు. పోలీసులు టీంలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదు.