
పంజాగుట్ట, వెలుగు: ప్రముఖ సాంస్కృతిక సామాజిక చైతన్య సంస్థ అయిన ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ ఆదివారం హోటల్టూరిజం ప్లాజాలో పలువురికి ‘స్వామి వివేకానంద ఇండియన్ఐకాన్ అవార్డ్స్’ పేరిట అవార్డులు అందజేసింది. అవార్డులు అందుకున్నవారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు, సోషల్వర్కర్లు, క్రీడాకారులు, సినీ గాయకులు, వ్యాపార వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు.
వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతి ఏటా అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నామని సంస్థ సీఈఓ సత్యవోలు రాంబాబు తెలిపారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్బి.లక్ష్మీకాంతం, గౌరవ అతిథిగా సాలార్జంగ్మ్యూజియం మాజీ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, తెలంగాణ పబ్లిక్ హెల్త్డైరెక్టరేట్ ప్రత్యేక అధికారి డాక్టర్డీఎస్ రవితేజ హాజరయ్యారు.