
లియోన్ (స్పెయిన్): ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.. పదోసారి లియోన్ మాస్టర్స్ టైటిల్‌ను గెలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో ఆనంద్ 3–1తో జెమీ సాంటోస్ లాటాసా (స్పెయిన్)ను ఓడించాడు. 1996లో తొలిసారి ఇక్కడ తొలి టైటిల్ నెగ్గిన విషీకి ఈ టోర్నీ హాట్ ఫేవరెట్. తొలి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న ఆనంద్ మూడో గేమ్‌లో విజయం సాధించాడు. నల్ల పావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ 45 ఎత్తుల్లో ఈజీగా సాంటోస్‌కు చెక్ పెట్టాడు. కచ్చితంగా గెలవాల్సిన లాస్ట్ గేమ్‌లో సాంటోస్ చేసిన చిన్న తప్పిదాలను ఆనంద్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి సెమీస్‌తోనే సరిపెట్టుకున్నాడు. అతను 1.5–2.5తో సాంటోస్ చేతిలో ఓడాడు.