
Vitamin B12.. మన శరీరానికి కేంద్ర నాడీ వ్యవస్థలకు అవసరమైన విటమిన్. శరీర వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ B12 ను సైనకోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తి, నరాలు, కణాల నిర్వహణ, DNA సంశ్లేషణతో సహా వివిధ శారీరక ప్రక్రియ లలో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి విటమిన్ B12 లోపిస్తే ఏం జరుగుతుందో.. చికిత్స ఏమిటో తెలుసుకుందాం.
Vitamin B12 లోపం శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో Vitamin B12 లోపం డిమెన్షియా(మానసిక వైకల్యం) కు దారితీస్తుంటున్నారు డాక్టర్లు.. ఇంతకీ డిమెన్షియా అంటే..ఇది పిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధులలో ఒకటి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ సుధీర్.. విటమిన్ B12 లోపం వల్ల డిమెన్షియాతో బాధపడుతూ..తనదగ్గర చికిత్స తీసుకున్న 12 యేళ్ల విద్యార్థి సంబంధించిన ట్రీట్ మెంట్ గురించి ట్విట్టర్ లో పంచుకున్నారు.
చదివింది గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు.. చదువుల్లో వెనకబడి పోతున్నాడు.. గతం కంటే ఇప్పుడు దేనిపైనా శ్రద్ధ లేకుండా ఉండిపోతున్నాడు.. దయచేసి మావాడికి ట్రీట్ మెంట్ చేసి కాపాడండి అంటూ 12 యేళ్ల విద్యార్థిని తీసుకొని అతని తల్లిదండ్రులు డాక్టర్ సుధీర్ దగ్గర వచ్చారు. విద్యార్థిని సునిశితంగా పరీక్షించిన డాక్టర్.. విటమిన్ B12 లోపం వచ్చే డిమెన్షియా అని తేల్చారు.
డిమెన్షియా లక్షణాలు..
డిమెన్షియా లక్షణాలున్న పిల్లలు చదివిన వాటిని గుర్తుకు తెచ్చుకోలేరు..వారు ఇప్పటికే కష్టపడుతున్న కఠినమైన సబ్జెక్టులు లేదా సబ్జెక్టులలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంతకుముందు ఎక్కువ ఇష్టంతో చేసే పనులపట్ల కూడా ఆసక్తి లేకపోవడం, చాలా సందర్భాలలో పిల్లవాడి ప్రవర్తనలో మార్పు ఉండవచ్చు. ప్రశాంతంగా, విధేయతతో ఉన్న పిల్లవాడు ఉద్రేకపూరిత ప్రవర్తనతో కోపంగా మారవచ్చు.
ఇవి కాకుండా పిల్లవాడు పాదాలు, చేతుల్లో జలదరింపు ఫీలింగ్, పిడికిలి, నోటిపై కూడా నల్లటి చర్మాన్ని గమనించవచ్చు. పిల్లల్లో జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లేకపోవడం, ప్రవర్తనా సమస్యలు, వ్యక్తిత్వంలో మార్పు, పాఠశాలలో తక్కువ పనితీరు, అధిక భయం వంటివి తరచుగా తల్లిదండ్రులచే గుర్తించబడని ప్రధాన సంకేతాలు అంటున్నారు డాక్టర్ సుధీర్ కుమార్.
పిల్లలలో తక్కువగా గుర్తించే వ్యాధుల్లో డిమెన్షియా (చిన్ననాటి చిత్తవైకల్యం) ఒకటి.. దీనిపై శ్రద్ధ అవసరం. ప్రారంభంలో రోగనిర్ధారణ,చికిత్స ప్రారంభిస్తే జ్ఞాపకశక్తి , ఇతర మెదడు విధులు పూర్తిగా పునరుద్ధరింపబడతాయి" అని డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు.
విద్యార్థిని పరీక్షించిన తర్వాత.. విటమిన్ బి12 స్థాయి కేవలం 60 పిజి/మిలీ మాత్రమే ఉందని కనుగొన్నారు. విటమిన్ B12 సాధారణ పరిధి 200 pg/mL ,900 pg/mL మధ్య ఉంటుంది. పిల్లవాడికి విటమిన్ బి 12 లోపంతో డిమెన్షియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
“ట్రీట్ మెంట్ లో భాగంగా విటమిన్ బి 12 ఇంజెక్షన్లను ఆ విద్యార్థికి ఇచ్చాను. నెల పాటు అబ్జర్వ్ చేశాను. అటెన్షన్ స్పాన్, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదలను చూపించింది. మరో మూడు నెలల తర్వాత ఆ విద్యార్థి.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా చాలా ఎక్కువ స్కోర్‌లతో ఉత్తీర్ణత సాధించాడు” అని డాక్టర్ సుధీర్ ట్వీట్ చేశారు.
Ashu’s parents wanted a memory pill so that he could do well in examinations
— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) September 2, 2023
12-year-old Ashu (name changed) was a bright child, and he was doing well in studies until 5th grade. However, he changed for the worse during grade 6th. He failed and needed to repeat the 6th grade.… pic.twitter.com/tBNuaJCYyk