
కుంటాల వెలుగు: ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. కుంటాలలో జుట్టు నారాయణ, నరేందర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్మించిన రెండు వసతి గదులను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం గజ్జలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గజ్జలమ్మ అలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఆలయ నిర్మాణంతో పాటు, ప్రహరీ, రాజగోపురం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ జుట్టు శైలజ, ఎస్టీయూ జిల్లా బాధ్యులు వసతి గదులను నిర్మించిన జుట్టు గజేందర్ దంపతులను అభినందించి శాలువాతో సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్క గజ్జరాం, సర్పంచ్ సమత వెంకటేశ్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరాం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మ్యూజిగే ప్రవీణ్, మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, సీఐ నైలు, గ్రామస్థులు పాల్గొన్నారు