ఆలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి : విఠల్ ​రెడ్డి

ఆలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి : విఠల్ ​రెడ్డి
  •     మంత్రి సురేఖకు విఠల్ ​రెడ్డి వినతి

భైంసా, వెలుగు : ముథోల్​నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి మంజూరైన నిధులను త్వరగా విడుదల చేయాలని ఆ శాఖ మంత్రి కొండా సురేఖను మాజీ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్​లోని సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని

ఇందుకు సంబంధించి టెండర్లను త్వరగా పిలిచి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించినట్లు విఠల్​రెడ్డి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్​ లీడర్లు ఆనంద్​రావు పటేల్, బాశెట్టి రాజన్న, రాజు తదితరులున్నారు.