TheDelhiFiles: హెడ్ లైన్స్‌లో నిలిచిన 'ఢిల్లీ ఫైల్స్తో' వస్తోన్న..సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి

TheDelhiFiles: హెడ్ లైన్స్‌లో నిలిచిన 'ఢిల్లీ ఫైల్స్తో' వస్తోన్న..సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి

ది కశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ లాంటి చిత్రాల తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) నుంచి వస్తున్న చిత్రం ‘ది ఢిల్లీ ఫైల్స్‌‌‌‌’(The Delhi Files). పల్లవి జోషితో కలిసి అభిషేక్ అగర్వాల్‌‌‌‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది.

‘ది ఢిల్లీ ఫైల్స్ - ది బెంగాల్ చాప్టర్’ టైటిల్‌‌‌‌తో రూపొందుతున్న మొదటి భాగం రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను గురువారం (అక్టోబర్ 3న) రివీల్ చేశారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ఇందులో చూపించబోతున్నామని, అందుకు అవసరమైన సమగ్ర సమాచారం కోసం కేరళ నుండి కోల్‌‌‌‌కతా, ఢిల్లీ వరకు ప్రయాణించి విస్తృత పరిశోధనలు చేసినట్టు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి చెప్పారు.  

Also Read : దేవర మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?

దేశవ్యాప్తంగా ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్'తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న కార్తికేయ 2, విమర్శకుల ప్రశంసలు పొందిన గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తుండటం విశేషం.

ది ఢిల్లీ ఫైల్స్::

ది ఢిల్లీ ఫైల్స్- ది బెంగాల్ చాప్టర్ అనే టైటిల్‌తో అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమా హెడ్ లైన్స్‌లో నిలిచింది. అయితే,ఈ ఢిల్లీ ఫైల్స్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు. వాటిలో మొదటి రిలీజ్ డేట్ని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ది ఢిల్లీ ఫైల్స్- ది బెంగాల్ చాప్టర్ అనే టైటిల్‌తో మొదటి భాగం రానుంది.

కాగా, డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన సినిమా కోసం సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి చాలా నగరాలలో రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు. అందులో భాగంగా కేరళ నుంచి కోల్‌కతా, ఢిల్లీ వరకు చాలా దూరం ప్రయాణించి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో కొన్ని వందల పుస్తకాలను చదివి చాలా ముఖ్యమైన అంశాలతో ముందుకొస్తున్నాడు.