Vivek Agnihotri: రిలీజ్కు ముందే 'సూపర్ డిజాస్టర్' అంటూ సినీ క్రిటిక్ పోస్ట్.. ఫైర్ అయిన డైరెక్ట‌ర్

Vivek Agnihotri: రిలీజ్కు ముందే 'సూపర్ డిజాస్టర్' అంటూ సినీ క్రిటిక్ పోస్ట్.. ఫైర్ అయిన డైరెక్ట‌ర్

దర్శక,నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri)తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ 'ది ఢిల్లీ ఫైల్స్'. లేటెస్ట్గా 'ది ఢిల్లీ ఫైల్స్' (The Delhi Files) మూవీ 'సూపర్ డిజాస్టర్' కాబోతుందని ఓ మూవీ క్రిటిక్ (సినీ విశ్లేషకుడు) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇపుడు ఈ పోస్ట్ బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ను రీ పోస్ట్ చేస్తూ.. ఆ సినీ క్రిటిక్పై వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా విమర్శించారు.

‘బాలీవుడ్‌కు ఏమైంది. వరుసగా అందరూ ఫ్లాప్‌ సినిమాలు తీస్తున్నారు. రాబోయే‘ది దిల్లీ ఫైల్స్‌’కూడా డిజాస్టర్‌ అవుతుంది’అని ఒక విశ్లేషకుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై వివేక్‌ అగ్నిహోత్రి అసహనం వ్యక్తం చేస్తూ దానికి బ‌దులిచ్చారు.

"బాలీవుడ్‌ డౌన్‌ అవుతుందా? గత రెండేళ్లలో ఇండస్ట్రీకి ఎన్నడూ లేనన్ని వరుస విజయాలు దక్కాయి. ‘పఠాన్‌’,‘జవాన్‌’,‘గదర్‌2’, ‘యానిమల్‌’,‘స్త్రీ 2’,ఇప్పుడు లేటెస్ట్గా ‘ఛావా’,.. ఈ ఆరు సినిమాలు రూ.500 కోట్లకు పైగానే క‌లెక్ష‌న్లు సాధించాయి. వరుసగా ఆరు సినిమాలు ఇలాంటి విజయాలు సాధించిన పరిశ్రమ మరొకటి ఉందా? 2023 మొత్తం వసూళ్లలో బాలీవుడ్‌ నుంచే 65 శాతం కలెక్షన్లు నమోదయ్యాయి. ఒక సినీ విశ్లేషకుడిగా మీరు సినిమా డిజాస్టర్‌ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?’’ అని వివేక్‌ రాసుకొచ్చారు.

అలాగే రీసెంట్గా థియేటర్స్ లోకి వచ్చిన మూవీకి జరిగిన ప్రమాదాన్ని వివేక్ గుర్తుచేశాడు. ఇబ్రహీం అలీ ఖాన్ మరియు ఖుషీ కపూర్ నటించిన 'నదానియన్' సినిమాపై ప్రేక్షకులు,  విమర్శకుల నుంచి వచ్చిన ప్రశంసల గురించి పంచుకున్నారు. కానీ, ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చిందని,  మరియు నటీనటుల నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయని సినీ క్రిటిక్స్ తెలిపారు.

అయితే, విమర్శకులు ఈ సినిమాకు 3.5 స్టార్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇలా సినిమా విడుదలకు ముందే డిజాస్ట‌ర్ అవాల‌ని ఎందుకు కోరుకుంటున్నార‌ని వివేక్ ఆ సదరు సినీ విశ్లేషకుడిపై ఫైర్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే, 'ది ఢిల్లీ ఫైల్స్' మూవీ ఆగస్టు 15, 2025న విడుదల కానుంది.

ది కాశ్మీర్ ఫైల్స్‌‌‌‌ చిత్రంతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఫస్ట్ ‘ది తాష్కంట్‌ ఫైల్స్‌’.. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించింది. ఇపుడు ఢిల్లీ ఫైల్స్ తో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.

  • Beta
Beta feature