పెళ్లికి ముందు అమ్మాయిలతో రిలేషన్.. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది

పెళ్లికి ముందు అమ్మాయిలతో రిలేషన్.. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది

పెళ్లికి ముందు అమ్మాయిలతో రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్. తాను కాలేజ్ లో  చదువుకున్నప్పటి నుంచే లవ్ , మ్యారేజ్ పై  చాలా క్లియర్ గా ఉండేవాడినని చెప్పారు. 

చదువు, బిజినెస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఇలా బిజిగా ఉండేవాడిని. ప్రేమించడానికి పెద్దగా సమయం ఉండేది కాదు. చాలా మంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నప్పటికీ వారిని గర్ల్ ఫ్రెండ్స్ గా భావించేవాడిని కాదు. నా చిన్ననాటి ప్రియురాలు క్యాన్సర్ తో మృతి చెందింది. అప్పటి నుంచి సీరియస్ రిలేషన్ షిప్స్ ఆసక్తి ఉండేది కాదు.  కానీ ఎవరినైనా లవ్ చేసినప్పుడు  సిన్సియర్ గా ఉండేవాడిని. నేను ఎవరిని మోసం చేయలేదు.  వారే సర్వస్వం అనుకునేవాడినని అన్నారు వివేక్ ఓబెరాయ్.

వివేక్ ఓబెరాయ్ 2010లో ప్రియాంకను పెళ్లి చేసుకున్నారు.వీరికి వివాన్ అనే కుమారుడు, అమేయ అనే కూతురు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన  కంపెనీ(2002)తో  వివేక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.  తర్వాత సాథియా, యువ,మస్తీ,కాల్,ఓంకార, షుటౌట్, క్రిష్ 3,వివేగం,లూసిఫర్,  తెలుగులో రక్తచరిత్రలో నటించారు.