వివేక్ రామస్వామి అవినీతిపరుడు: ట్రంప్

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి.. అవినీతిపరుడు అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఎంటర్​ప్రెన్యూర్ అయిన వివేక్.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.

రామస్వామికి మద్దతు పలికి ఓటు వేస్ట్ చేసుకోవద్దన్నారు. తనకు ఓటు వేసి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బలపర్చాలని కోరారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ (మాగా) స్లోగన్​తో ట్రంప్ ప్రచారం చేశారు. ఈ సారి కూడా ఇదే నినాదంతో జనంలోకి వెళ్తున్నారు. కాగా, ట్రంప్ విమర్శలపై రామస్వామి స్పందించారు. ట్రంప్.. 21వ శతాబ్దపు ఉత్తమ అధ్యక్షుడు అని వివేక్ అన్నారు. అతన్ని విమర్శించాలని అనుకోవడం లేదని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు.