పాక్​ హోటల్​కు న్యూయార్క్​ సిటీ 1860 కోట్లు ఇచ్చుడేంది.?: రామస్వామి

పాక్​ హోటల్​కు న్యూయార్క్​ సిటీ 1860 కోట్లు ఇచ్చుడేంది.?: రామస్వామి

వాషింగ్టన్​: దేశంలో అక్రమ వలసదారులకు ఆతిథ్యం ఇచ్చేందుకు  పాకిస్తాన్​ హోటల్​కు న్యూయ్యార్క్​ సిటీ 220 మిలియన్​ డాలర్లు (రూ.1860 కోట్లు) చెల్లించడాన్ని రిపబ్లికన్​ పార్టీ నేత వివేక్​ రామస్వామి తప్పుపట్టారు. ఇల్లీగల్​ మైగ్రేంట్స్​కు పన్ను చెల్లింపుదారుల నిధులతో వసతి కల్పిస్తారా అని బైడెన్​ సర్కారును ప్రశ్నించారు.

 అమెరికాలో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు పాక్​సర్కారుకు చెందిన రూజ్​వెల్ట్​ హోటల్​కు న్యూయార్క్​ సిటీ సొమ్ము చెల్లిస్తున్నదని తాజాగా ఓ రిపోర్ట్​ రిలీజ్​అయింది. అలాగే, అమెరికా రచయిత జాన్​లెఫెవ్రే కూడా ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.