- సరిహద్దు మూసేయాలంటే ట్రంప్‌కు ఓటేయండి: రామస్వామి
- ప్రతి ఒక్క ఇమ్మిగ్రెంట్ నాకు పేరెంట్స్‌తో సమానం
- వివేక్ స్పీచ్‌కు ప్రజలు, రిపబ్లికన్లు ఫిదా
మిల్వాకీ (వాషింగ్టన్) : అమెరికాలో లా అండ్ ఆర్డర్ పక్కాగా అమలు కావాలన్నా.. శాంతిభద్రతలు పునరుద్ధరించాలనుకున్నా.. ట్రంప్‌కు ఓటేసి ప్రెసిడెంట్‌గా గెలిపించాలని ఎంటర్ప్రెన్యూర్, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి కోరారు. ట్రంప్ అధ్యక్షుడు అయితేనే.. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. ప్రపంచంలో అమెరికాను తిరుగులేని శక్తిగా అవతరించాలనుకుంటే ట్రంప్‌కు ఓటేయాలని కోరారు. అమెరికాను మళ్లీ గొప్పగా చేయాలనుకుంటే ఆయన్ను గెలిపించాలని అన్నారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో వివేక్ రామస్వామి స్పీచ్‌కు అక్కడి వాళ్లంతా ఫిదా అయిపోయారు.
స్టాండింగ్ ఒవేషన్‌తో చప్పట్లు కొట్టి అభినందించారు. ‘‘మాటలతో కాకుండా.. చేతలతో అమెరికాను ఏకం చేయడం ట్రంప్‌తోనే సాధ్యం. ఎక్స్‌లెన్స్, సక్సెస్ మన సొంతం.. ఎప్పుడూ మనం అలాగే ఉండాలి. ఇప్పుడు మనం చాలా మిస్ అవుతున్నాం. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఏకీభవిస్తే.. అమెరికన్లుగా ఉన్నందుకు ఎంతో గర్విస్తారు. హింసకు వ్యతిరేకంగా పోరాడే దేశం మనది’’అని అన్నారు. లీగల్‌గా అమెరికాలో ఉండే ప్రతి ఒక్క ఇమ్మిగ్రెంట్ తన పేరెంట్స్‌తో సమానమని తెలిపారు. అమెరికాలో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం తల్లిదండ్రులపైనే ఉందన్నారు.