సార్.. నన్ను ఆదుకోండి.. వివేక్ కుమారుడు వంశీకృష్ణకు దివ్యాంగుడి వేడుకోలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, తనను ఆదుకోవడం లేదని మంచిర్యాల జిల్లా క్యాథన్​పల్లి మున్సిపాలిటీకి చెందిన మేడపట్ల సతీశ్​అనే దివ్యాంగుడు వాపోయాడు. తనను ఆదుకోవాలంటూ కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణను శనివారం హైదరాబాద్ లో కలిసి వేడుకున్నాడు. రెండు చేతులూ కోల్పోయిన సతీశ్.. తన పరిస్థితి చెప్పుకుని ఆవేదన చెందాడు. 

చైతన్య దివ్యాంగుల వేదిక ద్వారా దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పాడు. సతీశ్ ఆవేదనను అర్థం చేసుకున్న వంశీకృష్ణ.. తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.