
హైదరాబాద్: దళితులు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విగ్రహ ధ్వంసం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం దళితులంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తన తండ్రి వెంకటస్వామి.. విద్యాసంస్థలు స్థాపించారని చెప్పారు వివేక్.