కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి యువతకు ఆదర్శం

తెలంగాణ సాధన కోసం జీవితాంతం అలుపెరగకుండా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ  అని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక కమిటీ ఛైర్మన్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు 
వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెంలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ  జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ  చిత్రపటానికి  వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యమున్న కొండా లక్ష్మణ్ బాపూజీని  నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేశారని గుర్తుచేశారు.