పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బుర్ర రాము ఇటీవల చనిపోగా ఆయన కుటుంబాన్ని వివేక్ పరామర్శించారు.
ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వివేక్ అభిమాని పల్లె ప్రశాంత్ నాయనమ్మ శేషమ్మ ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట లీడర్లు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, సయ్యద్ సజ్జద్, సదయ్యగౌడ్, సతీశ్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు.