అట్టహాసంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె రిసెప్షన్

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో జరిగిన ఈ వేడుకకు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులు రిసెప్షన్కు హాజరయ్యారు. రిసెప్షన్ వేదిక వద్ద భారీ సెట్టింగ్స్  నిర్మించారు. వర్షం పడితే ఎవరికీ అసౌకర్యం కలగకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేయించారు. ఇక రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాగర్ కెనాల్ పై సొంత ఖర్చుతో రెండు స్టీల్ బ్రిడ్జిలను నిర్మించారు. వేడుకకు దాదాపు 3లక్షలమంది హాజరవుతారన్న అంచనాతో భోజన ఏర్పాట్లు చేశారు. 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కుమార్తె పెళ్లిని ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలిలో అట్టహాసంగా జరిపించారు. వధూవరుల కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 500 మంది వివాహానికి హాజరయ్యారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి వారందరినీ ప్రత్యేక విమానాల్లో బాలికి తీసుకెళ్లారు.