మిషన్ భగీరథలో అనేక అవకతవకలు జరిగాయి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథలో అనేక అవకతవకలు జరిగాయి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా తాను చెన్నూరులో తిరిగినప్పుడు చాలా మంది వారి సమస్యలను పరిష్కరించాలని కోరారని అన్నారు. గత పదేళ్లలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని..  రోడ్లు డ్రైనేజీ లను పట్టించుకోలేదని అన్నారు.మిషన్ భగీరథ ప్రాజెక్టు లో అనేక అవకతవకలు జరిగాయని.. కేసీఆర్ ఇంటింటికి నళ్లా నీళ్ళు ఇవ్వకుంటే ఎలక్షన్ కి రాను అని అన్నారని గుర్తు చేశారు. 

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూర్ రైతులు నష్టపోయారని.. మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరానన్నారు. పంట నష్టంపై సర్వే నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. నష్టపరిహారం అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామని అన్నారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎవ్వరూ నష్టపోకుండా చూస్తామని అన్నారు.

Also Read :- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు..

చెన్నూర్ ప్రాంతాన్ని అమృత్ స్కీం ద్వారా 30 కోట్లతో పనులు ప్రారంభించామని... బోర్ వేల్స్ వేసి గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసామని అన్నారు. చెన్నూరు ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కోటపల్లి మండలానికి అంబులెన్స్ అవసరం ఉందని తన దృష్టికి వచ్చిందని.. త్వరలోనే 2 అంబులెన్స్ లు రాబోతున్నాయని అన్నారు.100 పడకల ఆసుపత్రిని తొందరగా మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అన్ని పనులు తొందర్లోనే పూర్తి చేస్తామని అన్నారు వివేక్ వెంకటస్వామి.