భీమారం మండలంలో డప్పు కొట్టుకుంటూ వివేక్ అభిమాని ప్రచారం

జైపూర్(భీమారం), వెలుగు: చెన్నూర్ కాంగ్రెస్​ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని ఆయన అభిమాని వేల్పుల శ్రీనివాస్ డప్పు కొట్టుకుంటూ భీమారం మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారెంటీలతో పాటు ఆ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించారు.

పలువురు పార్టీ సీనియర్లు భీమారంలోని పలు కాలనీల్లో వివేక్​కు  ప్రచారం నిర్వహించారు.రాబోవు రోజుల్లో జరుగబోయే పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీడర్లు భూక్య లక్ష్మణ్, చేకుర్తి సత్యనారాయణ, ఆవుల సురేశ్,బానోత్ బన్సిలాల్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.