బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడంలో బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. వివేక్తో పాటు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బండి సంజయ్ ను కలిశారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేర్పుల అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి సూచనలపై నేతలు చర్చించారు. మరోవైపు ఈనెల 21న నిర్వహించనున్న అమిత్ షా సభ ఏర్పాట్ల గురించి బండి సంజయ్తో పాటు వివేక్ వెంకటస్వామి సమీక్షించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు.