గోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన

గోదావరిఖని, వెలుగు :  గోదావరిఖనిలో కాంగ్రెస్​ సీనియర్​ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం పర్యటించారు. స్థానిక కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాంగ్రెస్ నాయకుడు కామ విజయ్ తండ్రి రాజలింగంను పరామర్శించారు. రాజలింగంకు ఇటీవల గుండె  ఆపరేషన్ అయింది. విషయం తెలుసుకున్న  వివేక్​వెంకటస్వామి..  రాజలింగం ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులకు, కార్యకర్తలకు  తాను అండగా ఉంటానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ లీడర్లు, అభిమానులు వివేక్ కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో లీడర్లు పి.మల్లికార్జున్, గోవర్ధన్ రెడ్డి, తిప్పారపు మధు, సజ్జద్, సురేందర్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.