కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయింది... : వివేక్​ వెంకటస్వామి

అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాంనగర్​లో జూన్​22న బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్​ సంపర్క్​ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్​తో పాటు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రూ.60 వేల కోట్ల అప్పుల నుంచి రూ.6 లక్షల కోట్ల అప్పులకు బీఆర్​ఎస్​ సర్కార్​ తీసుకెళ్లిందని విమర్శించారు. వ్యవసాయానికి 1000 టీఎంసీల నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం ఇప్పటివరకు 100 టీఎంసీలూ ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి రూ.18 వేల సబ్సిడీని వివిధ రూపాలలో అందిస్తున్నట్లు చెప్పారు. 

కొమురంభీం జిల్లాలోని కాగజ్​నగర్లో బీజేపీ చేపట్టిన గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. ప్రజలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.