ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు

సుల్తానాబాద్, వెలుగు: మునుగోడు సీటు బీజేపీ గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ కు చెందిన బీజేపీ లీడర్లు శుక్రవారం మునుగోడులో వివేక్ ను కలిసి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. దేవత్ పల్లి, నాంపల్లి, మాల్, మర్రిగూడెం తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అవుతాయని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సజ్జత్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దే విడి తిరుపతిరెడ్డి, సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రవాణాపై అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు

సుల్తానాబాద్, వెలుగు: మండలంలోని మానేరు పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి రాకేశ్, జిల్లా అధికార ప్రతినిధి గడ్డం సతీశ్​శుక్రవారం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ కు ఫిర్యాదు చేశారు. సాండ్ టాక్స్ ట్రాక్టర్ యజమానులు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలనికోరారు.

జీపీ రేటు ప్రకారమే పన్ను వసూలు

చొప్పదండి,వెలుగు: చొప్పదండి జీపీగా ఉన్నప్పుడు పన్ను రేటు 0.15శాతం ఉందని, అప్పటి రేటు ప్రకారమే మున్సిపాలిటీలో పన్ను వసూలు చేస్తున్నామని మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీలో కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భువన్​ యాప్ ద్వారా నివాస, వాణిజ్య భవనాల కొలతలు, ఖాళీ స్థలం, సెల్ఫ్ అసెస్​మెంట్​నమోదు ప్రకారం కేటాయించిన రేట్ల ప్రకారం పన్నులు వేశామన్నారు. ఇతర కొత్త మున్సిపాలిటీలో పన్నులు పెంచినప్పటికిని చొప్పదండిలో పెంచడానికి కౌన్సిల్ తీర్మానం చేయలేదన్నారు. గతంలో ఉన్నభూమి వాల్యుయేషన్ రేట్లు చాలాసార్లు పెరిగాయని, ఆ మేరకే పన్ను పెరిగినట్లు నీరజ తెలిపారు. సమావేశంలో వైస్ చైర్​పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు అశోక్​, శ్రీనివాస్​, మహేశ్, జ్యోతి, సంధ్య, మానస, స్వతంత్రభారతి, జమున తదితరులు పాల్గొన్నారు.

‘భజరంగ్‌‌‌‌‌‌‌‌దళ్‌‌‌‌‌‌‌‌ కమిటీ వేయాలి’

గోదావరిఖని, వెలుగు : విశ్వహిందూ పరిషత్ ఏర్పడి 60 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా గ్రామంలో వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ, భజరంగ్‌‌‌‌‌‌‌‌ దళ్‌‌‌‌‌‌‌‌ కమిటీలు వేయాలని వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ రాష్ట్ర సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక శారదానగర్‌‌‌‌‌‌‌‌లోని వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వహిత సేవా సమితి ఆధ్వర్యంలో వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ భవన్‌‌‌‌‌‌‌‌లో మహిళలు నేర్చుకోవడానికి కుట్టు మిషన్లను, వాటర్‌‌‌‌‌‌‌‌ ఫ్యూరీఫయర్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ జిల్లా అధ్యక్షుడు వెంకటరావు, జిల్లా కార్యదర్శి అ యోధ్య రవీందర్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

కొడిమ్యాల, వెలుగు: రాష్ట్రస్థాయి 55వ సీనియర్ ఖోఖో పోటీలు శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఖోఖో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలో ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగ రాఘవ రెడ్డి, నిర్వాహకులు కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి మమత, ఉమ్మడి జిల్లా సెక్రెటరీ మహేందర్ రావు, జడ్పీటీసీ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. మొదటి రోజు కరీంనగర్ పురుషుల టీమ్ సత్తా చాటింది. 19–12 తేడాతో నల్క్గొండ జట్టును ఓడించింది. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేశ్వరి, హెచ్.ఎం మల్లేశం 
పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

కోనరావుపేట, వెలుగు : సిరిసిల్లలో నవతెలంగాణ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న కారంగుల వినోద్ రావు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వినోద్ రావు 15 ఏళ్లుగా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఇటీవల బాత్​రూంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ  మృతి చెందారు. 

కరీంనగర్ డెయిరీ స్టేట్ లోనే ఫస్ట్

కరీంనగర్‍టౌన్, వెలుగు: కరీంనగర్ డెయిరీ రాష్ట్ర ప్రజలకు అత్యధిక పాలను అందిస్తూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని, రోజుకు 5 లక్షల లీటర్ల పాలను విక్రయించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని  కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన కరీంనగర్ డెయిరీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో  ఆయన మాట్లాడారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండలో రోజుకు 3 లక్షల లీటర్ల పాల నిర్వహణ సామర్థ్యంతో ఆధునిక మెగా డెయిరీని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎండీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.