ప్రపంచంలోనే గొప్ప లీడర్ మోదీ : వివేక్ వెంకటస్వామి

ప్రపంచంలోనే గొప్ప లీడర్ మోదీ  :  వివేక్ వెంకటస్వామి

లక్సెట్టిపేట/చెన్నూర్, వెలుగు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే గొప్ప లీడర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. నిరంతరం పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే తపిస్తారని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ లో గురువారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరైన వివేక్ మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ఆయన వివరించారు. దేశ ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్  ఫ్రీగా పంపిణీ చేయడమే కాకుండా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించి కోట్లాది మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​ధరలు తెలంగాణ కంటే రూ.10 తక్కువగా ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్​ను ఎన్నికల్లో ఓడించాలని.. అభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, పాల్గొన్నారు.  

అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నరు..

ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తటస్థులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని వివేక్​అన్నారు. గురువారం మంచిర్యాలోని ఆయన​ నివాసంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​ఆధ్వర్యంలో మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్​అడిషనల్​ మేనేజర్​సీహెచ్ కృష్ణారావు బీజేపీలో చేరారు. ఆయనకు వివేక్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ALSO READ : OTTలోకి సూపర్ హిట్ బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

ఆ తర్వాత చెన్నూర్​లో మాట్లాడుతూ.. కృష్ణారావు చేరికతో సింగరేణి ప్రాంతంలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందన్నారు. పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​జాయింట్ కన్వీనర్​ నగునూరి వెంకటేశ్వర్లు, టౌన్​ ప్రెసిడెంట్ ​సుశీల్​కుమార్, జైపూర్, భీమారం మండలాల అధ్యక్షుడు విశ్వంభర్​రెడ్డి, వేల్పుల శ్రీనివాస్​తదితరులు
 పాల్గొన్నారు.