కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్ బాధితులను పట్టించుకోరా : వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్ ముంపు బాధిత రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలోని 3 మండలాల్లో ఆయన పర్యటించారు. ముంపు రైతుల బాధలు తెలుసుకున్నారు. కాటారంలో కొత్తగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. 

మల్హర్ మండలం అన్సాన్ పల్లిలో నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో పాల్గొన్నారు. మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం కాళేశ్వరంలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల వర్షాలకు ఇల్లు కూలిన బాధితుడు గోరె నగేశ్​ను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టం కలిగిన రైతులు వివేక్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్కారు మారితేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్​ను తేవాలని ప్రజలను కోరారు.

40 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయితరు

మోదీ సర్కార్ తెచ్చిన మహిళా బిల్లు దేశంలోనే పెద్ద రెవెల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెస్తుందని వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్ర అసెంబ్లీలో 40 మంది మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం దక్కుతుందన్నారు. కాటారంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ దూరదృష్టితో ఈ బిల్లు తెచ్చారని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే 33 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు.

తీజ్ వేడుకల్లో పాల్గొని..

భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అన్సాన్ పల్లిలో గురువారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో  వివేక్ పాల్గొన్నారు. యువతులు మోసుకొచ్చిన గోధుమ నారు బుట్టలు నెత్తిన పెట్టుకొని వారితో కలిసి కాలుకదిపారు. ఇటీవల తీజ్ ఉత్సవాల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అజ్మీరా శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. వివేక్ వెంట చంద్రుపట్ల సునీల్ రెడ్డి, కన్నం జగదీశ్వర్, శ్రీమన్నారాయణ, ముడతనపల్లి ప్రభాకర్, సూరం మహేష్, రామకృష్ణ, ఆకుల రమేశ్, మల్క మోహన్ రావు పాల్గొన్నారు.