బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం చేసుకుండు: వివేక్ వెంకటస్వామి

 సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబాన్ని చేసుకున్నారని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా సీపీఐ ఆఫీసులో చాడ వెంకట్ రెడ్డిని కలిసారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తన నాన్న కాకా వెంకటస్వామికి సీపీఐతో  మంచి అనుభందం ఉండేదన్నారు . కేసీఆర్ నియంతృత్వ పాలనను అణచి వేయాలన్నారు. చిన్నయ్య , బాల్క సుమన్ కేసీఆర్ ల అధికారాన్ని దించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి.

వివేక్ వెంకటస్వామిని గెలిపించడానికి సహకరిస్తాం

 చెన్నూరులో వివేక్ వెంకటస్వామిని, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో సీపీఐ కృషి చేస్తుందన్నారు  ఆ పార్టీ నేత చాడ వెంకట్ రెడ్డి.  కాళేశ్వరం నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా వ్యవహరిస్తుందన్నారు. ఐదురాష్ట్రాల్లో జరగనున్న సీపీఐ  కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుందని చెప్పారు.

చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి రోజు బైక్ ర్యాలీ, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి బీఆర్ఎస్  అభ్యర్థి బాల్కసుమన్  అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.