మునుగోడు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చి ఆడిపాడారు. ఈ వేడుకల్లో బీజేపీ మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు  రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.