సీఎం రేవంత్‌‌ను కలిసిన వివేక్, వంశీకృష్ణ

సీఎం రేవంత్‌‌ను కలిసిన వివేక్, వంశీకృష్ణ

వివేక్ వెంకటస్వామి కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో రేవంత్‌‌తో వివేక్, ఆయన సతీమణి సరోజ, కుమారుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన అనంతరం మొదటిసారి వంశీకృష్ణ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి పాల్గొన్నారు.    

- వెలుగు, హైదరాబాద్