ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని మైనారిటీ నాయకులు ఫాయాజొద్దిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  కాంగ్రెస్ ఎమ్మె్ల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,  పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకి  దివంగత నేత కాకా ధరించే టోపీని మైనారిటీ నాయకులు అలంకరించారు.  టోపీ ధరించిన అనంతరం అచ్చం కాకాను చూసినట్లే ఉందంటూ  స్థానిక నాయకులు కొనయాడారు.  ఇఫ్తార్ విందులో మైనారిటీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.