వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణకు ఘన స్వాగతం 

ధర్మారం, వెలుగు :  ధర్మపురి వెళ్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణకు సోమవారం ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ధర్మారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల తాగునీటి కోసం కాకా ఫౌండేషన్ ద్వారా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ ఏర్పాటు చేయించినందుకు ఉత్సవ కమిటీ ఛైర్మన్, ట్రెజరర్లు ఫౌండేషన్ చైర్మన్ వివేక్ వెంకటస్వామిని శాలువాతో సన్మానించారు.

అనంతరం నర్సింహులపల్లె గ్రామంలో నిర్వహించే ఎల్లమ్మ పట్నాలకు రావాల్సిందిగా కమిటీ సభ్యులు ఆయనను ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, మెడవేని తిరుపతి, ఓరేం చిరంజీవి, పొన్నవేని స్వామి, తిరుపతి, ఎల్లయ్య పాల్గొన్నారు.