
- నల్గొండ, మునుగోడులో కోమటిరెడ్డి సోదరుల విజయం
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతుల విక్టరీ
- మల్లారెడ్డి, ఆయన అల్లుడు గెలుపు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాకా వెంకటస్వామి కుమారులు ఇద్దరు డాక్టర్గడ్డం వివేక్‌వెంకటస్వామి చెన్నూరు నుంచి, గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి గెలిచారు. కాంగ్రెస్సీనియర్నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), ఆయన సతీమణి పద్మావతి (కోదాడ).. వారి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి (బీఆర్ఎస్- హుజూరాబాద్) ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీఆర్ఎస్చీఫ్కేసీఆర్గజ్వేల్నుంచి విజయం సాధించగా, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయన కుటుంబం నుంచి కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట) విజయం సాధించారు. మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు.
మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నుంచి, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వరంగల్ ఈస్ట్ నుంచి ఓడిపోగా, ఎర్రబెల్లి అల్లుడు మదన్మోహన్రావు ఎల్లారెడ్డి నుంచి విజయం సాధించారు. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయినా ఆయన తనయుడు రోహిత్మెదక్నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఎస్పీ స్టేట్చీఫ్డాక్టర్ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్నుంచి వికారాబాద్ లో పోటీ చేసిన వారి బావ డాక్టర్మెతుకు ఆనంద్ ఓటమి పాలయ్యారు. హుస్నాబాద్నుంచి బీఆర్ఎస్ పోటీ చేసిన వొడితెల సతీశ్‌కుమార్, హుజూరాబాద్నుంచి కాంగ్రెస్అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడి కుమారుడు వొడితెల ప్రణవ్ఓటమి పాలయ్యారు.