ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు వున్న రాష్ట్రంగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ 8, 9, 10 వార్డుల్లో బీజేపీ గడప గడపకు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది కానీ బాధితులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి ని యాజమాన్యం నడిపించడం లేదని చెప్పిన వివేక్... రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, టీబీజీకేఎస్ చెప్పినట్టు సింగరేణిని అధికారులు నడిపిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఇన్ కాంటాక్స్ ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.